ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి డిపో పరిధిలో మంగళగిరి పరిసర ప్రాంత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈనెల 11వ తేదీన మంగళగిరి డిపో మేనేజర్ కార్యాలయంలో ఉదయం 11 నుంచి 12: 00 వరకు "డైల్ యువర్ డిఎం" కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ పిచ్చయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సూచనలను, సలహాలను 9959225424 ఫోన్ నెంబర్కు తెలియజేయవలసిందిగా కోరారు.