ప్రకాశం బ్యారేజ్ నుంచి 6, 522 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్కి 276 క్యూసెక్కులు, బ్యాంక్ కెనాల్ 1, 748, క్యూసెక్కులు, తూర్పు కాలువకు 681, పశ్చివ కాలువకు 270, నిజాపట్నం కాలువకు 506, కొమ్మూరు కాలువకు 2, 680 క్యూసెక్కులు, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2, 72, 750 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.