ఇక నుంచి మంగళగిరి ఆఫీసులో సీబీఎన్ బ్రాండ్ కారు

30 ఏళ్ల క్రితం ఉపయోగించిన 393 అంబాసిడర్ కారును చూసి సీఎం చంద్రబాబు తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు ఈ కారులో పర్యటించిన ఆయన, దీనిని 'సీబీఎన్ బ్రాండ్ కారు'గా అభివర్ణించారు. ఈ కారుతో తనకు అపారమైన అనుబంధం ఉందని తెలిపారు. హైదరాబాద్ నుంచి తెచ్చిన ఈ కారును ఇకపై మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు.

సంబంధిత పోస్ట్