రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ ఆఫీసులో హోంమంత్రి అనిత వీటిని విడుదల చేశారు. ఫలితాలను వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఈ ఫలితాలలో గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో, జి. రమ్య మాధురి (159) రెండో స్థానంలో, మెరుగు అచ్యుతారావు(144. 5) మూడో స్థానంలో నిలిచారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.