మంగళగిరి తాడేపల్లి పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు బుధవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ సురేష్ బాబు తెలిపారు. ఇందిరా నగర్, ద్వారకానగర్, ఎల్బీ నగర్, ఆత్మకూరు రోడ్, బైపాస్ సర్వీస్ రోడ్, ఆరో బెటాలియన్, డీజీపీ ఆఫీసు, ఎస్ఆర్ నగర్, డోలస్ నగర్, డిలైట్ దాబా ప్రాంత ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు.