మంగళగిరి: మారిషస్ అధ్యక్షుడి రాక సందర్భంగా బందోబస్తు

మారిషస్ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ గుంటూరు రాక సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలకు గోకుల్ తోపాటు ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్న నేపథ్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి ఎస్పీ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఐటీసీ వెల్కమ్ హోటల్, తెలుగు మహాసభల ప్రాంగణం, మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంతాల్లో ఇంటెలిజన్స్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ తో కలిసి పర్యటించి, వీవీఐపీల భద్రత, రూట్ బందోబస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

సంబంధిత పోస్ట్