రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మాస్కో అడ్వాన్స్డ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్‌ను బుధవారం సందర్శించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. మెట్రో, బస్సులు, ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్-షేరింగ్, స్కూటర్లు వంటి అన్ని రవాణా సేవలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకురావడం, ప్రయాణికులకు ఒకే యాప్ ద్వారా అన్ని సేవలు అందుబాటులో ఉండటం ఆధునిక రవాణా వ్యవస్థకు ఉదాహరణగా నిలుస్తుందని లోకేశ్ తెలిపారు.