మంగళగిరి మంచినీటి వినియోగదారులకు గమనిక

మంగళగిరిలో గల 18, 20, 21, 23 వార్డుల్లో నివాసం ఉంటున్న ప్రజలకు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ముఖ్య ప్రకటన చేసింది. కార్పొరేషన్ పరిధిలో తాగునీటి పైప్ లైన్లు మరమ్మత్తులు పనులు జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం మరియు శనివారం రెండు రోజులపాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్టు నగరపాలక సంస్థ కమిషనర్ బాషా తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలందరూ దీన్ని గమనించి సహకరించాలని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

సంబంధిత పోస్ట్