ఉండవల్లిలో కృష్ణా నది నీరు పెనుమాక రిజర్వాయర్ వైపు మళ్లుతున్న పరిస్థితిని అధికారులు సమీక్షించారు. ఈ నేపథ్యంలో ఏడీసీ సీఎండీ డి. లక్ష్మీపార్థసారథి, ఉండవల్లి పంపింగ్ స్టేషన్ వద్ద నీటిపారుదల శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక అడ్డుకట్టను వెంటనే తొలగించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా కొండవీటివాగు, పాలవాగులలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, నీటి నిల్వలు, ప్రవాహ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.