సబ్‌స్టేషన్ నిర్వహణ, మరమ్మతు పనుల కారణంగా తాడేపల్లి మండలంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు డీఈఈ అనిల్‌బాబు తెలిపారు. ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తాడేపల్లి, బ్రహ్మానందపురం, వడ్డేశ్వరం, రాధారంగానగర్, మదర్ థెరిస్సా కాలనీల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.