తాడేపల్లి: సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణకు భూసేకరణ నోటిఫికేషన్

అమరావతి ప్రధాన కనెక్టివిటీ ప్రాజెక్టుగా ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు విస్తరణ కోసం సీఆర్డీఏ 27.73 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. సీతానగరం నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకు 23.68 ఎకరాలు, ఈ-13 రోడ్డు అనుసంధానానికి మరో 4.05 ఎకరాలు సేకరించనుంది. మొత్తం 74 మంది భూ యజమానుల నుంచి భూములు తీసుకోనుండగా, అభ్యంతరాలు ఉన్న వారు తెనాలి సబ్ కలెక్టర్‌కు తెలియజేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్