పల్నాడు జిల్లా నరసరావుపేటలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు స్థానిక ఏరియా వైద్యశాల ప్రసూతి విభాగాన్ని బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలు, భోజనం, మందులపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. సిబ్బందిని కనికరంతో వ్యవహరించాలని, ప్రసవాల్లో తక్షణ వైద్యం అందించాలని సూచించారు. పారిశుధ్యం, ఉచిత మందులు, ల్యాబ్‌లకు పంపకూడదని ఆదేశించి, నిర్లక్ష్యానికి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రి అభివృద్ధికి పూర్తి సహకారం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.