పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం జరిగిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ బి. కృష్ణారావు కీలక సూచనలు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. PGRS ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రౌడీషీటర్లపై నిఘా, పోలీస్ స్టేషన్లలో రాత్రి గస్తీలు బలోపేతం చేయాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని చెప్పారు.