అక్రమ వెంచర్లపై పుడా కార్యాలయం వద్ద బాధితులు నిరసన

పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ (పుడా) కార్యాలయం వద్ద బాధితులు, పిడిఎం నాయకులు గురువారం నిరసన తెలిపారు. కోటప్పకొండ సమీపంలోని నంది హిల్స్ వెంచర్ పర్మిషన్ రద్దు చేయాలని, అక్రమ వెంచర్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నరసరావుపేట మండలంలో భూములు ఆక్రమించి, అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఏవో కి మెమోరాండం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్