ఇంకొల్లు మండలం నక్కలపాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల ఎలిమెంటరీ స్కూల్ నందు శనివారం పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా, ఎస్సీల పట్ల సాంఘిక దురాచారాలు, అత్యాచార సంఘటనలు, రెండు గ్లాసుల విధానం వంటివి అమలులో ఉన్నాయా అని తహశీల్దారు ప్రశ్నించగా, అలాంటివి ఏవీ లేవని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో, ఆర్ఐ, గ్రామపెద్ద చిలుకూరి శ్రీనివాసరావు పాల్గొన్నారు.