బాపట్ల జిల్లా గనుల శాఖకు కొత్త అధికారి నియామకం

బాపట్ల జిల్లాకు నూతన జిల్లా గనులు & భూగర్భ శాస్త్ర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జి. శ్రీనివాస్ నియమితులయ్యారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆయన పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను కలిశారు. జిల్లా అభివృద్ధితో పాటు ఖనిజ వనరుల సంరక్షణ, అక్రమ తవ్వకాల నియంత్రణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్