నిరంతర పర్యవేక్షణ.. సత్ఫలితాలను ఇస్తుంది: మంత్రి

ప్రభుత్వాసుపత్రుల్లో నిరంతర పర్యవేక్షణ సత్ఫలితాలను ఇస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. గురువారం రాజధాని అమరావతిలో గ‌త ఆరు నెల‌లో ప్రభుత్వాసుపత్రుల ప‌ని తీరుపై ఉన్నతాధికారులతో మంత్రి సత్యకుమార్ స‌మీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల్లో పురోగతి కనిపించిందన్నారు. రోగికి ఓపీ సేవలు 42 నిమిషాల నుంచి 26 నిమిషాల‌కు త‌గ్గడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్