పొన్నూరు అర్బన్ సీఐ ఎల్ వీరా నాయక్, దిక్కులేని అనాధలను స్వచ్ఛందంగా ఆదరించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 7న వార్షికోత్సవ సందర్భంగా హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిడుబ్రోలు మార్కెట్ యార్డ్ వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హెల్పింగ్ హాండ్స్ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. 7న నిడుబ్రోలు శాంతోమ్ కరుణాలయంలో జరిగే ప్రేమ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.