పొన్నూరు పురపాలక సంఘo పరిధిలో గురువారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పలు వార్డులలో పర్యటించారు. వార్డుల్లో శానిటేషన్, త్రాగునీరు సరఫరా సక్రమంగా జరగాలని వార్డు శానిటేషన్ సిబ్బందికి సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిబ్బంది పనితీరు మెరుగుపడాలని సూచించారు. శానిటరీఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.