గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం ఏడవ వార్డులో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డులో అర్హులైన వారందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పెన్షన్లు రాకుండా అర్హులైన వారు ఉంటే వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సచివాలయ సిబ్బంది, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.