చేబ్రోలు మండలం గొడవర్రు గ్రామంలో బుధవారం రాత్రి "పల్లె నిద్ర" కార్యక్రమం జరిగింది. తెనాలి సబ్ డివిజన్ డి. ఎస్. పి జనార్ధన రావు పాల్గొని గ్రామంలోని ప్రజలందిరితో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని పోలీసు అన్నివేళలా అందుబాటులో ఉంటారని ఏ సమస్యలు వచ్చిన పోలీస్ లకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలు మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగహన కల్పించారు.