పొన్నూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో మొత్తం 6 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూకు ఒకటి, పంచాయతీ రాజ్ కు ఒకటి, మునిసిపల్ కు రెండు, సోషల్ వెల్ఫేర్ కు ఒకటి, మరియు హెల్త్ విభాగానికి ఒకటి చొప్పున ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. తహసీల్దార్ మహమ్మద్ జియావుల్ హక్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అందిన ఫిర్యాదులను పరిశీలించి, సంబంధిత శాఖలకు పంపి, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.