ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్-2026 ఓటరు సర్వే వేగంగా కొనసాగుతోంది. మొత్తం 2,70,185 మంది ఓటర్లలో 2,66,510 మందికి (98.64%) ఫారాలు పంపిణీ చేశారు. 43,739 ఫారాల (16.19%) డిజిటైజేషన్ పూర్తయింది. ఓటర్లు తమ వివరాలను పరిశీలించి, పూర్తి చేసిన ఫారాలను బీఎల్వోలకు సకాలంలో అందించాలని అధికారులు సూచించారు.