గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను కాకుమాను పోలీస్ స్టేషన్ నూతన ఎస్సై బత్తుల హరికృష్ణ శనివారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పూల మొక్కను అందించారు. ప్రజలకు ఉత్తమమైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేయాలని, శాంతి భద్రతల పరిరక్షణకై పాటుపడాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్సై హరికృష్ణకు సూచించి శుభాకాంక్షలు తెలిపారు.