గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిర్చియార్డు పరిధిలో కార్మిక శాఖ అధికారులు శనివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇరువురు బాల కార్మికులను గుర్తించారు. వారి తల్లిదండ్రులకు అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చి, బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.