ప్రత్తిపాడు మండలంలో నేడు విద్యుత్ అంతరాయం

ప్రత్తిపాడు, ఈదులపాలెం సబ్‌స్టేషన్ల పరిధిలో 11 కేవీ విద్యుత్ లైన్ల నిర్వహణ, మరమ్మతు పనుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో పవర్ కట్ ఉండనుంది. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని శాఖకు సహకరించాలని ఏఈ సూచించారు.

సంబంధిత పోస్ట్