ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం ఆర్డీవో శ్రీదేవి

రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో సోమవారం జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమానికి మొత్తం ఏడు అర్జీలు అందాయని ఆర్డిఓ శ్రీదేవి తెలిపారు. రేపల్లె పట్టణం నుండి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ అర్జీలను పరిశీలించి, సంబంధిత అధికారులకు పంపి, సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని శ్రీదేవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ స్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్