స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) శుక్రవారం రేపల్లె ఆర్టీసీ డిపో ఎదుట నిరసన తెలిపింది. ఆర్టీసీ డిఎం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. డిపో స్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్టీసీ మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు సీహెచ్. మణిలాల్, ఎన్ వి. సాగర్, జిల్లా అధ్యక్షులు ఏ. సత్యనారాయణలు విమర్శించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.