అనుపాలెం వద్ద శనివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడటంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలుడిని సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్ మానవత్వాన్ని చాటుకున్నారు. పదో తరగతి పరీక్షలు ముగించుకొని వెళుతున్న విద్యార్థులు బాలుడిని బయటకు తీసి సహాయం చేశారు. సీఐ కిరణ్ వెంటనే స్పందించి పోలీస్ వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.