నకరికల్లు మండలంలో డూప్లికేట్ ఫోన్ దొంగలు సంచరిస్తున్నారని, ప్రజలు, వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం సాయంత్రం ఎస్ఐ కె. సతీష్ తెలిపారు. ఈ దొంగలు వ్యాపార సముదాయాల వద్దకు వచ్చి, తమవారు ఆసుపత్రిలో ఉన్నారని, అత్యవసరంగా డబ్బులు కావాలని దీనంగా అడుగుతారని ఆయన గమనించాలని కోరారు. ఈ సమాచారం మండల ప్రజలు, వ్యాపారస్తులకు ముఖ్య గమనికగా పోలీస్ శాఖ తెలియజేసింది.