ముప్పాళ్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత.

ముప్పాళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం (13/06/2026) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏపీసీపీడీసీఎల్ అధికారులు తెలిపారు. 33KV, 11KV లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లలో అత్యవసర మరమ్మతుల కారణంగా ఈ షట్‌డౌన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యుత్ వినియోగదారులు సిబ్బందికి సహకరించాలని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హరీష్ శ్రీనివాస ప్రసాద్ సూచించారు. అత్యవసర పనులు దృష్ట్యా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్