పల్నాడు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల నాయకులతో పార్లమెంట్ సమన్వయకర్త గౌతమ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నుంచి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి శుక్రవారం సమీక్ష జరిపారు. నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని, పార్టీ కోసం పనిచేసే నాయకులను గుర్తించి పదవులు ఇవ్వాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతం లక్ష్యం అన్నారు.