అమరావతిపై జగన్ ద్వేషం.. సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు

ఎన్డీఏ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, అమరావతి రాజధాని బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని తెలిపారు. అమరావతి పట్ల జగన్ ద్వేషం, మావిగన్ అనే వింత పేరును తీసుకురావడం వంటి అంశాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. గతంలో 'ఎస్ఆర్ఎం అమరావతి' పేరును 'ఎస్ఆర్ఈ'గా మార్చిన విషయాన్ని గుర్తుచేస్తూ, అమరావతి పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉందని, నిత్యం విషం కక్కుతున్నారని విమర్శించారు. అమరావతి పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని స్పష్టమైందని సీఎం వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్