లచ్చన్నగుడిపూడిలో మూత్రపిండాల వ్యాధి పీడితులను పరీక్షించేందుకు శుక్రవారం ప్రత్యేక వైద్య బృందం వెళ్తుంది. గుంటూరు వైద్యశాలకు చెందిన ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లో నెఫ్రాలజిస్టు, ఫిజీషియన్ సహా కొంతమంది వైద్యులుంటారు. గ్రామంలో కిడ్నీ వ్యాధి పీడితులు పెరగడానికిగల కారణాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఇప్పటికే వైద్యఆరోగ్యశాఖ బృందం బాధితులతో మాట్లాడగా డీఎంహెచ్వి డాక్టర్ విజయలక్ష్మి సైతం గ్రామాన్ని సందర్శించారు.