తుళ్లూరు: ఇకపై పాఠశాలల్లో రాజకీయాలకు నో ఎంట్రీ

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రాజకీయ కార్యకలాపాలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక జీవో జారీ చేసింది. రాజకీయ నాయకులు, ఇతరులు పాఠశాలల్లోకి ప్రవేశించడం, పోస్టర్లు ప్రదర్శించడం, విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం వంటివాటిపై నిషేధం విధించింది. డొనేషన్లు ఇవ్వాలన్నా అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులను మినహాయించింది.

సంబంధిత పోస్ట్