తుళ్లూరు: ఏపీ సచివాలయం వద్ద ఆందోళన

తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయం వద్ద శుక్రవారం ఎస్సీ, ఎస్టి పారిశ్రామికవేత్తలు నిరసన చేపట్టారు. నాలుగు సంవత్సరాలుగా ఎంఎస్ఎమ్ఈలకు ఇవ్వాల్సిన రాయితీలు వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీఐఐసీ కార్యాలయంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో, సచివాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని, కొందరిని అధికారులతో మాట్లాడేందుకు లోపలికి పంపించారు.

సంబంధిత పోస్ట్