తుళ్ళూరు: అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన

అమరావతి రాజధాని నిర్మాణ పనులను మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెనల పనులను తనిఖీ చేసిన ఆయన, వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఆర్డీఏ ఆధ్వర్యంలో 43, ఎల్పీఎస్ లేఅవుట్లలో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పనుల నాణ్యత, వేగంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్