తెనాలి: నందివెలుగు జంక్షన్ నుంచి ఆటోనగర్ వెళ్లే రహదారి వెంట ఉన్న అనధికార నిర్మాణాలు, ఫ్లెక్సీలు, హోర్డింగులను అధికారులు శనివారం తొలగించారు. తెనాలి రూరల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, పంచాయతీ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. గాలివానలు, వర్షాల సమయంలో ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యగా ఆక్రమణలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. రహదారుల పక్కన అక్రమంగా పాకలు, హోర్డింగులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.