తెనాలి: సబ్ కలెక్టర్ పిజిఆర్ఎస్ లో 16 అర్జీలు

ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 16 అర్జీలు స్వీకరించినట్లు సబ్ కలెక్టర్ సంజనసింహా తెలిపారు. వాటిలో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి ఆరు, పురపాలక సంఘానికి సంబంధించి మూడు, పోలీస్, గృహ నిర్మాణ శాఖలకు సంబంధించి రెండు చొప్పున, సర్వే, పంచాయితీ రాజ్, నీటిపారుదల శాఖకు సంబంధించి ఒక్కో అర్జీ చొప్పున దాఖలైనట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్