బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ వేమూరు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. రికార్డుల నిర్వహణలో లోపాలు, ముఖ్యంగా పీజీఆర్‌ఎస్‌కు సంబంధించిన దస్త్రాలు సక్రమంగా లేకపోవడం, ఒకే భూమిని ఇద్దరి పేర్లపై రిజిస్ట్రేషన్ చేయడం వంటి అంశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్, సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.