బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు గ్రామంలోని కళ్యాణమండపంలో శుక్రవారం స్పెషల్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను విన్నారు. ప్రతి అర్జీని పరిష్కరించి న్యాయం చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. కొన్ని అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో శ్రీదేవి, అధికారులు కూడా పాల్గొన్నారు.