ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా మంజూరైన 1, 81, 616 రూపాయల చెక్కులను వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు గురువారం బాధిత కుటుంబ సభ్యులకి అందజేశారు. కొల్లూరు మండలం దోనేపూడి గ్రామానికి చెందిన లంక అంకమ్మ, కృష్ణనగర్ గ్రామానికి చెందిన నెరుసు నాగ ఆంజనేయులు అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేసుకున్నారు. లంక అంకమ్మ కి 1, 26, 611 రూపాయలు, నెరుసు నాగ ఆంజనేయులు గారికి 55, 000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.