నూజెండ్ల: గ్రామంలో రెవిన్యూ వారి రి సర్వే కార్యక్రమం

నూజెండ్ల మండలం తలార్లపల్లి రెవిన్యూ గ్రామంలో రీ సర్వే, జిటి వర్క్ వేగంగా జరుగుతున్నాయని సోమవారం మండల తహసిల్దార్ రమేష్ కుమార్ తెలిపారు. గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను పరిశీలించిన ఆయన, రైతులతో మాట్లాడి రెవెన్యూపరమైన సమస్యలుంటే తనను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ చండిరాణి, గ్రామ సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్