AP: రాష్ట్రం నుండి పవిత్ర హజ్ యాత్ర-2027కు వెళ్లాలని ఆశించే ముస్లింలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ యాత్రకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర మంత్రి ఫరూక్ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గత ఏడాది హజ్ యాత్రకు వెళ్లిన 1,987 మంది యాత్రికులకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున మొత్తం రూ. 3.31 కోట్లను ప్రభుత్వం నేరుగా వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ ఆర్థిక సాయం యాత్రికుల ప్రయాణ భారాన్ని తగ్గించిందని ప్రభుత్వం పేర్కొంది.