ఏపీ నూతన డీజీపీగా హరీష్‌కుమార్ గుప్తా నియమితులయ్యారు. హరీష్‌కుమార్ గుప్తాను రాష్ట్ర డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు పదవీకాలం జనవరి 31న ముగియనుంది. ఆయన స్థానంలో గుప్తా బాధ్యతలు తీసుకోనున్నారు. గుప్తా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం గుప్తా విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు డీజీపీగా గుప్తా కొనసాగనున్నారు.