AP: తిరుమల లడ్డూ అంశంపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై మాజీ సీఎస్ దినేష్ కుమార్ సమర్పించిన ఏకసభ్య కమిటీ నివేదికను అధ్యయనం చేసేందుకు హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏపీ సీఎస్, డీజీపీ, లా సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. నివేదికలోని అంశాలను సమగ్రంగా పరిశీలించి తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.