AP: రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులపై విద్యాశాఖ ఇటీవల షెడ్యూల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10 (రెండో శనివారం), 11 (ఆదివారం) నుంచి సెలవులు ప్రారంభమై, అక్టోబర్ 21 వరకు కొనసాగుతాయి. దీంతో విద్యార్థులకు మొత్తం 12 రోజుల పాటు విరామం లభిస్తుంది. దసరా సెలవులు ముగిసిన తర్వాత అక్టోబర్ 22న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.