జిల్లాలకు భారీగా నిధులు విడుదల

AP: జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిధులు విడుదల చేసింది. రూ.128 కోట్లు విడుదల చేసి వచ్చే నెల 20 నాటికి ఖర్చు చేయాలని ఆదేశించింది. గుంటూరు జిల్లాకు రూ.20.61 కోట్లు, నెల్లూరు జిల్లాకు రూ.8.60 కోట్లు, కృష్ణా జిల్లాకు రూ.6.21 కోట్లు చొప్పున ఎన్‌హెచ్ఎం బడ్జెట్‌లో చివరి విడత కింద (2025-26) నిధులు విడుదల చేసింది. మిగిలిన జిల్లాలకు గరిష్టంగా రూ.5.20 కోట్ల నుంచి రూ.2 కోట్ల చొప్పున నిధులు రిలీజ్ చేసింది.

సంబంధిత పోస్ట్