AP: పెరుగుతున్న ఉల్లి ధరల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు ఉపశమనం కలిగించేందుకు రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. ఈ విక్రయాలు తొలిదశగా విజయవాడలో ప్రారంభమై, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నాయి. కుటుంబానికి గరిష్టంగా 2 కిలోల ఉల్లిని ఆధార్ లేదా రేషన్ కార్డు ద్వారా అందించనున్నారు. ఇదిలా ఉండగా, 64 రకాల నిత్యావసరాలను తక్కువ ధరకు అందించేందుకు 'మీ మార్ట్'లు, బియ్యం, కందిపప్పు, పామాయిల్ సబ్సిడీ సరఫరా కూడా చేపడుతున్నట్లు మంత్రులు వెల్లడించారు.