ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి ఒక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంట్రోల్ రూమ్‌కు 1967 టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు 11.9 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతులకు 2,830 కోట్ల రూపాయలను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు.